ఇదేమి స‌మ‌ర్దింపు ఎన్నిక‌ల క‌మీష‌న్‌…

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌,గుజ‌రాత్ ఎన్నిక‌లు 2012లో ఒకేసారి జ‌రిగాయి. అలాగే వాటి ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా అప్పుడు
ఒకేసారి విడుద‌లైంది. కానీ ఇపుడు మాత్రం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ 10 రోజుల క్రితం కేవ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ కి మాత్ర‌మే ప్ర‌క‌టించి గుజ‌రాత్ కు ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌లేదు.దీనితో స‌హ‌జంగానేకేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నిన్న‌టి రోజున గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసిన సంధ‌ర్భంగా మాట్లాడిన ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అచ‌ల్‌జ్యోతి త‌మ నిర్ణ‌యాన్ని విచిత్రంగా స‌మ‌ర్ధించుకున్నారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌తోపాటుగుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ చేయ‌క‌పోవ‌టం ప్ర‌ధాని మోఢీకి మేలుచేయ‌టంకోసం కాద‌ట అక్క‌డ రాహుల్‌గాంధీ కూడా ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్ప‌టం విచిత్రం.మోఢీ,రాహుల్ లు ప్ర‌చారం ఎప్పుడైనా నిర్వ‌హించుకోవ‌చ్చుదానికి ఎన్నిక‌ల కోడ్ ఆటంకం కాబోదు. కానీ అధికారంలో ఉన్న.మోఢీ కొత్త నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌డానికి మాత్రం నియ‌మావ‌ళి అడ్డువ‌స్తుంది.మోడీ ప్ర‌యోజ‌నాల‌కోసం ప‌నిచేస్తున్న‌ట్లు ప‌బ్లిగ్గా దొరికిపోయి కూడా అర్ధంప‌ర్ధంలేని మాట‌ల‌తో స‌మ‌ర్ధించుకోవాల‌నిచూడ‌టం విడ్డూరం.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate