ఉపేంద్ర కొత్త రాజ‌కీయ పార్టీ

సినిమావాళ్లు రాజకీయ పార్టీలు పెట్టటం మామూలే. అయితే.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే సమయంలో టాలీవుడ్.. కోలీవుడ్.. శాండిల్ వుడ్ కు చెందిన సినీ ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం తాను రాజకీయ పార్టీ పెట్టనున్నట్లుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే.

చెప్పినట్లే.. ఆయన ఈ రోజు తన పార్టీని ప్రారంభించారు. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష పేరిట ఆయన తన రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీని పొట్టిగా కేపీజేపీగా వెల్లడించారు. బెంగళూరులోని గాంధీ భవన్ లో తన పార్టీని ఉపేంద్ర ఆవిష్కరించారు. తమది కేవలం పార్టీ మాత్రమే కాదని.. ప్రజల కోసం తమ పార్టీని పెట్టినట్లుగా చెప్పారు.

తాను ప్రజల కోసం ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేశానని.. ఆసక్తి ఉన్న వారంతా పార్టీలో చేరాలని.. మార్పు తేవటమే తన స్వప్నంగా ఆయన వెల్లడించారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate