ఎన్నాళ్ళ‌కి సోమువీర్రాజు!

బి.జె.పి. నాయ‌కుడుసోమువీర్రాజు ఈరోజు మీడియాముందుకు వ‌చ్చారు రెండు నెల‌ల క్రితం ఎ.పి. బి.జె.పి. అధ్య‌క్షుడిగా వీర్రాజును ప్ర‌క‌టించాల్పిఉండ‌గా చివ‌రి నిమిషంలో వెంక‌య్య‌నాయుడు అడ్డుప‌డ‌టంతో ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..అలిగారో,బాధ‌ప‌డ్డారో కానీ ఆనాటి నుంచి వీర్రాజు మీడియా కు క‌నిపించ‌లేదు.మ‌ళ్లీ ఇన్నాళ్ళ‌కు ప్యాకేజి విష‌యంపై
స్పందిస్తూ మీడియా ముందుకు వ‌చ్చారు.అది కూడా ఇత‌ర బి.జె.పి.నాయ‌కుల్లా కాకుండా డిఫ‌రెంట్ గా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైఇత‌ర బి.జె.పి.నాయ‌కులు విరుచుకు ప‌డుతుంటే వీర్రాజు మాత్రం ప‌వ‌న్ కు మ‌ర్యాద ఇచ్చారు. చంద్ర‌బాబులాగే ప‌వ‌న్ కూడా ప్యాకేజీని అర్ధం చేసుకోవాల‌న్నారు..చంద్ర‌బాబు ఎలాఅర్ధం చేసుకున్నారో మ‌రి..ఇంత‌కీ వీర్రాజుగారు మీ అధ్య‌క్ష ప‌ద‌వి ఏమైన‌ట్లు?

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate