ఎన్నిక‌లు రావాల్సిందేనా?

తెలుగుదేశం ఒక‌ప‌క్క బి.జె.పి.ని విమ‌ర్శిస్తోంది.. మ‌రో వైపు బి.జె.పి.లో సోమువీర్రాజులాంటి నేత‌లు టి.డి.పి.ని
ఆటాడుకుంటున్నారు.ఇంకో వైపు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరెండుపార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న‌
ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడు పార్టీలు ఒకేజ‌ట్టుగా ఉన్నాయి.ఇపుడు విమ‌ర్శించుకుంటున్నాయి క‌దా ఇక విడిపోయిన‌ట్లే అనుకోవ‌డానికి లేదు..ఎందుకంటే రాజ‌కీయం అంటే అదే..ఇలాంటి రాజ‌కీయంలో సాధార‌ణంగా కాంగ్రెస్ ఇటువంటి రాజ‌కీయంలో ఆరితేరిపోయి ఉంటుంది..ఇపుడు ఈమూడు పార్టీలు ఈ విష‌యంలో కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌ట్లున్నాయి.కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆపార్టీ లోనే గ్రూపులుగా ఏర్ప‌డి విమ‌ర్శించుకుంటూ ఉంటారు..అంటే విమ‌ర్శించే అవ‌కాశం కూడా ప్ర‌తిప‌క్షానికి ఇవ్వ‌ర‌న్న‌మాట‌..ఇపుడీ మూడు పార్టీలుకూడా అదే వైఖ‌రి అవ‌లంభిస్తున్నాయా;? లేక నిజంగానే క‌ల‌హించుకుంటున్నాయా? తెలియాలంటే 2019 ఎన్నిక‌లు
రావాల్సిందేనా?

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate