ఏదీ విశ్వ‌స‌నీయ‌త‌…ఎవ‌రినిన‌మ్మాలి

తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప‌ట్ల విశ్లేష‌కులు, జ‌ర్న‌లిస్టుల అభిప్రాయం ఇది. సాధార‌ణ ప్ర‌జానీకానికి మీడియా సంస్థ‌ల‌
తెర‌వెనుక క‌ధ‌లు తెలియ‌క‌పోయినా దాదాపుగా వారి అభిప్రాయం కూడా ఇలాగే ఉంది.మీడియా ప‌క్ష‌పాత‌ధోర‌ణుల‌తో
వ్య‌వ‌హ‌రించ‌టంతోనే ప్ర‌జ‌ల్లో విస్వ‌స‌నీయ‌త కోల్పోవ‌టం ప్రారంభ‌మైంది. దివంగ‌త నేత వై.ఎస్. రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004లో
అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి ఆయ‌న‌కు ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌కు మ‌ద్య పెద్ద యుధ్ద‌మేజ‌రిగింది.ఆరెండు
పత్రిక‌లూ అంటూ ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి పై వై.ఎస్. అసెంబ్లీలోనే ధ్వ‌జ‌మెత్తిన ఘ‌ట‌న‌లు చూసాం.తెలుగుదేశం పార్టీకి
కొమ్ముకాస్తు ఈనాడు,ఆంధ్ర‌జ్యోతిపేప‌ర్ లు వాటి టి.వి ఛాన‌ల్స్ త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతు న్నాయ‌నేది వై.ఎస్. ప్ర‌ధాన‌
ఆరోప‌ణ‌.రాజ‌కీయ‌వ్యూహాల్లో ఆరితేరిపోయిన వై.ఎస్. వ్యూహాత్మ‌కంగా ఈనాడు,ఆంధ్ర‌జ్యోతి పై బ‌హిరంగంగా
ధ్వ‌జ‌మెత్తుతూ అవి త‌మ‌కు వ్య‌తిరేఖం అన్న భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి పంపించ‌టంలో స‌క్స్ స్ అయ్యారు.ఈరెండు సంస్థ‌ల‌
పై వ్య‌తిరేఖ‌త‌తోనే సాక్షిటి.వి,సాక్షి దిన‌ప‌త్రిక‌ల‌కు వై.ఎస్.నాంది ప‌లికారు.కాంగ్రెస్ కు, త‌న‌కు వెన్నుద‌న్నుగా నిలిచేందుకు
వై.ఎస్. సాక్షిని ఏర్పాటుచేసినా మీడియాలో నాడైనా,నేడైనా టి.డి.పి.కి మ‌ద్ద‌తిచ్చే వాటి సంఖ్యే ఎక్కువ‌.ఆధ్యాత్మిక‌
ఛాన‌ల్ తోపాటు న్యూస్ ఛాన‌ల్ న‌డుపుతున్న ఓఛాన‌ల్ రాజ‌కీయంగా వై.ఎస్.ఆర్.సి.పి.కి,సామాజికంగా టి.డి.పి.కి
మ‌ద్ద‌తు ప‌లుకుతూ వ‌చ్చారు..అయితే ఏమైందోఏమోగానీ..టి.డి.పి.అధికార‌ప‌క్షంగాఉన్న‌కార‌ణ‌మో తెలియ‌దు కానీ
ప్ర‌స్తుతం ఈఛాన‌ల్ తోపాటు ప్ర‌ధాన న్యూస్ ఛాన‌ల్స్ అన్నీ టిడిపి గొంతునే వినిపిస్తున్నాయి.ఒక్క సాక్షిటివి,తెలంగాణ‌లో
టి న్యూస్ త‌ప్ప ఎక్కువ టి.వి.ఛానల్స్ తెలుగుదేవ‌శంపార్టీ ప‌క్ష‌మే.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate