ఏప్రిల్ 27నే నాపేరుసూర్య‌: ఈసారి వార్ బ‌న్నీ-మ‌హేష్ మ‌ద్యా?

అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమా మొదలైనపుడే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ అని ప్రకటించారు. కానీ కొన్ని రోజుల కిందటే మహేష్-కొరటాల శివ సినిమాను అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని గురించి టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక.. ఇంకో పెద్ద సినిమా రేసులోకి రావడమేంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ ‘నా పేరు సూర్య’ ఆ తేదీకి రావట్లేదా.. వాయిదా పడ్డ సంగతి తెలిశాకే ‘భరత్ అను నేను’ ఇలా రేసులోకి వచ్చిందా అని సందేహించారు. ఐతే తమ సినిమా విడుదల తేదీలో ఏ మార్పూ లేదంటూ ‘నా పేరు సూర్య’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ రోజు ప్రకటించాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’కు సంబంధించిన ప్రెస్ మీట్లో బన్నీ వాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. దీన్ని బట్టి బన్నీ అండ్ కో మహేష్ అండ్ టీంకు సవాలు విసిరినట్లే. మరిప్పుడు ‘భరత్ అను నేను’ టీం ఏం చేస్తుందో చూడాలి. వాళ్లు కూడా పంతానికి పోతే 2018 ఏప్రిల్ 27న మహేష్ వెర్సస్ బన్నీ వార్ చూడబోతున్నామన్నమాట.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate