గంటా మొన‌గాడేనా?..ముందుచూపు ఉన్న‌వాడూనా?

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో పార్టీ మార‌టం ఎంత స‌హ‌జ‌మో తాము ప్ర‌స్తుతం ఉన్న పార్టీఅధినేత‌కు విధేయ‌త‌తో ఉండ‌టం కూడా అంతే
స‌హ‌జం..అధినేత మ‌న‌సెరిగి న‌డ‌చుకున్న‌వారే పార్టీలో అయినా ప్ర‌భుత్వంలో అయినా అంద‌లాలెక్కుతారు.అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్
విద్యాశాఖా మంత్రి గంటాశ్రీనివాస‌రావు వ్య‌వ‌హార‌శైలి ఇందుకు భిన్నంగా ఉంది..మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని
స్ధాపించిన‌పుడు గంటా తెలుగుదేశంపార్టీకి రాజినామా చేసి చిరంజీవి వెంట న‌డిచారు..ఏ ముహూర్తాన గంటా చిరంజీవితో
చేతులు క‌లిపారో కానీ ఆయ‌న చిరంజీవికి అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు.చిరంజీవి కూడా గంటాకు అంత ప్రాధాన్య‌త‌
ఇచ్చారు.కాంగ్రెస్ లో విలీనం త‌రువాత గంటాకు,రామ‌చంద్ర‌య్య‌కు మంత్రి ప‌ద‌వులిప్పించారు.కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చిన త‌రువాత‌
2014 ఎన్నిక‌ల‌కు ముందు గంటా దేశం లో చేరారు..మ‌ళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు..అయిన‌ప్ప‌టికీ చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం వ‌దులుకోలేదు..తాజాగా వైజాగ్ లో స‌రైనోడు ఆడియో విజ‌యోత్స‌వ వేడుక‌కు అన్నీ
తానై వ్య‌వ‌హ‌రించారు.ఆ వేదిక‌పై చిరంజీవి తో త‌న సాన్నిహిత్యాన్ని ప్ర‌క‌టించుకోవ‌టానికి గంటా వెనుకాడ‌లేదు.
గంటా ప్ర‌స్తుతం తెలుగుదేశం ప్ర‌భుత్వంలో మంత్రి. చిరంజీవి కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ కు కీల‌క నాయ‌కుడు..
అయిన‌ప్ప‌టికీ గంటా త‌న అభిమానాన్ని వ్య‌క్తంచేయ‌టానికి వెనుకాడ‌లేదు.ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో గంటా మొన‌గాడే..
కేవ‌లం మొన‌గాడేనా,;? ముందు చూపు క‌ల‌వాడు కూడానా అన్న‌ది ఆలోచించాల్పిన విష‌య‌మే..ఎందుకంటే తెలుగు
దేశం ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేఖ‌త పెరుగుతున్న విష‌యం తెలిసిందే..ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ ప‌నితీరు ఎలా ఉందో తెలుస్తూనే
ఉంది.ఈ నేప‌ధ్యంలో ఏ రూపంలో నైనా చిరంజీవే ప్ర‌త్యామ్నాయం అవుతార‌ని గంటా ముందుగానే అంచ‌నా వేయ‌గ‌లుగు
తున్నారా?

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate