చెర్రీ,బ‌న్నీ హాలీడే ట్రిప్

ఎక్కువగా అందరు యూరోప్ దేశాలను ఎంచుకుంటూంటే మెగా ఫ్యామిలీ మాత్రం కొంచెం డిఫరెంట్ అడ్వెంచర్ అనుభూతుని పొందుతోంది. వింటర్ అనుభూతిని పొందడానికి హిమాలయాలకు చెందిన మనాలి హిల్ స్టేషన్ వైపు మళ్లారు. ఈ ట్రిప్ లో రామ్ చరణ్ దంపతులు అలాగే అల్లు అర్జున్ దంపతులతో పాటు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. అన్నయ్య బావ గారి సంతోషాన్ని కెమెరాలో బంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు స్టయిలిష్ లైఫ్ ను అనుభవించే వీరు అన్ని పక్కనపెట్టి సాధారణ వ్యక్తుల్లా ఆ ప్రదేశాన్ని చుట్టేస్తున్నారు.

లోయలను ఎత్తైన కొండలను చూస్తూ ట్రిప్ లో సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. రామ్ చరణ్ జడలబర్రెపై కూర్చొని ఉండగా ఆయన సతీమణి ఉపాసన దాన్ని తాడుతో లాక్కెళ్లడం వంటి చిలిపి పనులు కూడా చేశారు. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి కూడా అబ్బురపరిచే ప్రదేశాల నడుమ పోటోస్ కి స్టీల్ ఇచ్చారు. శిరీష్ కూడా అక్కడి ప్రాంతాల్లో ఉండే కుందేళ్లతో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మెగా ట్రిప్ ఆనందంగా గడిచిపోతుందట. చాలా ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. ఇక వారి ఫొటోస్ ని చుసిన అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate