చ‌ర‌ణ్ పై అంత అక్క‌సు ఎందుకో?

చేసిన చిత్రాలు 8(తెలుగులో)..40కోట్లుపైన షేర్ వ‌సూలు చేసిన చిత్రాలు 6..ఆహీరో స్టార్ డ‌మ్ ,స్టామినా గురించి చెప్ప‌డానికి
ఈఒక్క ఉదాహ‌ర‌ణ‌చాలు..కానీఎందుక‌నో పాపం చ‌ర‌ణ్ అంటే ఇటు సోష‌ల్ మీడియా,అటు ఎల‌క్ట్రానిక్ మీడియాలో అధిక‌శాతం
త‌మ అక్క‌సును వెళ్ళ‌గ‌క్కుతుంటాయి.బ్రూస్ లీ లాంటి డిజాస్ట‌ర్ చిత్రంకూడా 40కోట్లుపైన షేర్ వ‌సూలు చేసిందే..కానీ కొంద‌రి రాత‌లు ఎలా ఉన్నాయంటే..త‌నిఒరువ‌న్ రీమేక్ కోసం చ‌ర‌ణ్ త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుంటున్నాడ‌ట‌..ఎందుకంటే బ‌డ్జెట్ ఎక్కువైతే వ‌ర్క‌వుట్ కావ‌టంలేద‌ట‌..డిజాస్ట‌ర్ సినిమాకు కూడా 40కోట్లు షేర్ తీసుకువ‌చ్చిన ఒకేఒక్క స్టార్ హీరో చ‌ర‌ణ్ కే బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ కాక‌పోతే మిగ‌తా స్టార్ హీరోల ప‌రిస్ధితి ఏమిటో?..పెద్దోళ్ళ‌కు స‌న్ స్ట్రోక్ అని త‌మ త‌న‌యుల‌ను హీరోలుగా నిల‌బెట్ట‌డానికి తంటాలుప‌డుతున్న‌వారి సర‌స‌న చిరంజీవి ఫొటో వేసి రాత‌లు..అందులో మీడియా భీభ‌త్స మైన‌హైప్ ఇచ్చినా సినిమా డిజాస్ట‌ర్ అంటే 17,18కోట్లు దాట‌డానికే గగ‌న‌మైపోతున్న సినిమాహీరోతో చ‌ర‌ణ్ నుపోల్చ‌టం..ఒక్క సినిమా ఫ్లాప్(అదికూడా40కోట్లుపైగాషేర్ వ‌సూలుచేసింది.) కే స్టార్ డ‌మ్ ఎఫెక్ట్ అయిపోయే విష‌య‌మైతే 2014లో వ‌రుస‌గారెండుభారీడిజాస్ట‌ర్స్(30కోట్లు రేంజ్) ఇచ్చిన‌హీరో ఏమైపోవాలి..అస‌లు ప‌దేళ్ళ‌కుపైగా బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న‌దేలేనిహీరో ఏమైపోయిన‌ట్లు.. చ‌ర‌ణ్ అంటే ఇంత అసూయా?..నిజంగా బ్రూస్ లీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయుంటే వీళ్ళు ఏమైపోదురో పాపం..

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate