ట్రాజెడీ ముగింపేనా?

తెలుగు వెండితెరపై ఎప్పటికీ నిలిచిపోయే మొదటి తరం హీరోయిన్లలో మహానటి సావిత్రిది కచ్చితంగా ముందుపేరే. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు సంపాదించుకుని వేలాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఘనత ఆమె సొంతం. అప్పట్లోనే లక్షలాది రూపాయలు ఆస్తులు సంపాదించినా అవేవీ నిలుపుకోలేక చివరకు కోట్లాది మంది అభిమానాన్నే మిగుల్చుకున్న మెతక మనిషి.

సావిత్రి జీవిత కథతో యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ మహానటి సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తోంది. సావిత్రి భర్త జెమెనీ గణేశన్ పాత్రను మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. మహానటి సినిమాలో సావిత్రి ఎంత ఎత్తుకు ఎదిగింది అనేదే కాకుండా జీవితపు చివరి మజిలీలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను కూడా డైరెక్టర్ చూపించబోతున్నాడట. ‘‘చివరి రోజుల్లో సావిత్రి తాగుడుకు ఏ విధంగా బానిసయింది.. తన జీవితాన్ని తానే ఏ విధంగా పాడు చేసుకుంది.. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో జీవతం ఎలా గడిపింది.. ఆరోజుల్లో ఆమె వెంట ఉన్న స్నేహితులు’’ వంటి అన్ని విషయాలూ ఈ సినిమాలో చూపించబోతున్నారని యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు.

మహానటి సినిమాలో ఎస్.వి.రంగారావు పాత్రను విలక్షణ నటుడు మోహన్ బాబు పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే హీరోయిన్ జమున పాత్ర చేస్తోంది. హీరోయిన్ సమంత – ప్రకాష్ రాజ్ – రాజేంద్రప్రసాద్ తోపాటు విజయ్ దేవరకొండ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం – మళయాళ భాషల్లోనూ విడుదల చేయడానికి ప్లానింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate