దేశం గ‌ర్వించేలా సై..రా..సురేంద‌ర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచేలా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తీర్చిదిద్దాలని పట్టుదలతో ఉంది చిత్ర బృందం. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. తొందరపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం అడుగులేస్తోంది. ఈ సినిమా కన్ఫమ్ అయిన ఏడాదికి కానీ సెట్స్ మీదికి వెళ్లట్లేదు. ప్రి ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి చెప్పేయొచ్చు. ఈ పని తుది దశకు చేరుకుంది. డిసెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. స్క్రిప్టు లాక్ అయిపోవడం.. నటీనటులు.. టెక్నీషియన్లు కూడా దాదాపుగా ఫైనలైజ్ అయిపోవడంతో ఇక లొకేషన్ల వేటలో పడ్డాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.. కెమెరామన్ రత్నవేలు.

వీళ్లిద్దరూ కలిసి ఈ కథకు మూలమైన ప్రాంతానికి చేరుకున్నారు. కర్నూలు జిల్లాలోని నరసింహారెడ్డి స్వగ్రామం ఉయ్యాలవాడలో సురేందర్.. రత్నవేలు పర్యటిస్తున్నారు. ఆ గ్రామంతో పాటు చుట్టూ పక్కల ఊళ్లల్లో లొకేషన్లను ఫైనలైజ్ చేసుకుంటూ అక్కడి జనాల్ని కలిసి నరసింహారెడ్డి గురించి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా వీళ్లను కలిసింది. సురేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైరా నరసింహారెడ్డి’ అద్భుతమైన.. దేశం గర్వించే సినిమా అవుతుందని అన్నాడు. ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా తెరకెక్కించనున్నట్లు అతను వెల్లడించాడు. నరసింహారెడ్డి పూర్వీకుల ఇళ్లతో పాటు ఆయనకు అనుబంధం ఉన్న గుడి.. ఆయన కత్తిని ప్రతిష్టించిన ఊరిని సురేందర్ రెడ్డి.. రత్నవేలు సందర్శించారు. వీళ్లిద్దరూ కొన్ని రోజుల పాటు అక్కడే గడపనున్నారు. ఒరిజినల్ లొకేషన్లలోనే ఈ చిత్రాన్ని షూట్ చేయాలని భావిస్తున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate