ప్ర‌భాస్ ని వ‌దిలేసాడా?

బాహుబలి సిరీస్ కోసం 4ఏళ్లకు పైగా సమయాన్ని కేటాయించి అందుకు తగిన ఫలితాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే ప్రభాస్ బాలీవుడ్ వెళ్లనున్నాడనే వార్తలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి.

కానీ బాహుబలి2 తర్వాత ప్రభాస్ విపరీతమైన లేట్ చేస్తుండడంతో.. ప్రభాస్ తో బాలీవుడ్ మూవీ చేసే ఆలోచనను దర్శక నిర్మాత కరణ్ జోహార్ వదులుకున్నాడని రీసెంట్ గా వార్తలొచ్చాయి. దీనికి తోడు ప్రభాస్ 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే మాట కూడా ఇందుకు కారణమనే టాక్ ఉంది. ఈ న్యూస్ ప్రభాస్ ఇమేజ్ ను కొంత మేర డ్యామేజ్ చేసేవిగా మారాయి. అందుకే ప్రభాస్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపడేస్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో యంగ్ రెబల్ స్టార్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడని చెబుతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సాహో.. ఆ తర్వాత జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ ముందే అంగీకరించాడని.. వాటిపైనే దృష్టి నిలిపిన ప్రభాస్.. ఆ కమిట్మెంట్స్ ను కంప్లీట్ చేసిన తర్వాతే.. ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడని సన్నిహితులు అంటున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate