ప‌వ‌న్ ప‌క్క‌న అన‌గానే ఎగిరి గంతేసా

చేసింది తక్కువ సినిమాలే అయినా వరసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంది మల్లూ బ్యూటీ అను ఇమ్మానుయేల్. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మానుయేల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసిలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్.

పవన్ లాంటి స్టార్ హీరోతో నటించడానికి మొదటిరోజు బాగా ప్రిపేరై వెళ్లానని… కానీ ఆయన్ను చూడగానే అన్నీ మర్చిపోయానని పవన్ తో తన తొలిరోజు షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుని చెబుతోంది అను ఇమ్మానుయేల్. ముందు ఈ సినిమా యూనిట్ నుంచి ఫోన్ వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అడిగితే చెల్లెలి పాత్ర అయి ఉంటుందని అనుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ హీరోయిన్ పాత్ర కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నానని అంటోంది.

తన కెరీర్ స్టార్టయింది మాతృభాష మళయాళంలోనే అయినా.. తెలుగు ఇండస్ట్రీ తనకు బాగా నచ్చిందని చెబుతోంది. ఇక్కడే సెటిల్ అయిపోయి వీలున్నప్పుడల్లా తమిళం – మళయాళం సినిమాలు చేసుకుంటానని అంటోంది. అందుకోసమే ఇక్కడ సొంతంగా ఫ్లాట్ కూడా కొనేసుకుందట. ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ గోపీచంద్ తో కలిసి నటించిన ఆక్సిజన్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate