జి.ఎస్.టి. మోసాలు ఇన్నిన్ని కాద‌యా

అవకాశం ఉండాలే కానీ చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా వ్యాపార సంస్థలు చెలరేగిపోతాయన్నది మరోసారి నిరూపితమైంది. కస్టమర్లను దోచేసే చిన్న అవకాశం లభించినా విడిచిపెట్టని తీరు హైదరాబాదీయులకు షాకింగ్ గా మారింది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఈ తీరులో దోచేస్తున్నారన్న సందేహం కలగక మానదు.

ఒక దేశం ఒక పన్ను పేరుతో జీఎస్టీని అసరాగా చేసుకొని అన్యాయంగా పన్ను బాదేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇంతకాలం ఎందుకు కామ్ గా ఉన్నారో కానీ.. ఇప్పుడు ఉన్నట్లుండి పౌర సరఫరాల శాఖకు మెలుకవ వచ్చింది. జీఎస్టీ అమలు తర్వాత కొన్ని వ్యాపార సంస్థలు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరలు అమ్మితే.. మరికొందరు ధరల ట్యాగ్ లు లేకుండా వస్తేవుల్ని అమ్మేయటం.. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న వైనంపై తెలంగాణ రాష్ట్ర అధికారులు కన్నెర్ర చేశారు.

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ షాపింగ్ మాల్స్.. సినిమా థియేటర్లతో పాటు.. చైన్ ఐస్ క్రీం పార్లర్లు.. ప్రముఖ హోటళ్లు.. రెస్టారెంట్లు.. వస్త్ర దుకాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వేయాల్సిన పన్ను బాదుడుకు భిన్నంగా భారీగా బాదేస్తున్న హెటళ్లను అధికారులు గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో పౌరసరఫరాల శాఖకు భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. కదిలిన యంత్రాంగం హైదరాబాద్ లోని ప్రముఖ మాల్స్.. మల్టీఫ్లెక్స్ లు.. వస్త్రదుకాణాలు.. రెస్టారెంట్లతో సహా పలు వాణిజ్య సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate