ప‌వ‌న్ స‌భ పైనే అంద‌రి చూపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో రేపు జ‌రుప‌త‌ల‌పెట్టిన సీమాంధ్రా ఆత్మ‌గౌర‌వస‌భ పైనే ప్ర‌స్తుతం
అంద‌రిచూపూ ఉంది. నిన్న‌టి రోజంతా కేంద్ర‌ప్ర‌భుత్వం ఊరించి ఊరించిఉస్సుర‌నిపించిన నేప‌ధ్యంలో ప్యాకేజిపై ప‌వ‌న్ స్పంద‌న‌
ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ స్వాగ‌తిస్తారా? లేక వ్య‌తిరేఖిస్తారా?
అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ స‌భ జ‌రిగే జె.ఎన్.టి.యు. మైదానం కేవ‌లం ల‌క్ష మందికి మాత్ర‌మే
స‌రిపోతుంది.. కానీ ప‌వ‌న్ స‌భ‌కు కికేవ‌లం తూర్పుగోదావ‌రిజిల్లా నుంచే 4,5ల‌క్ష‌ల‌మంది జ‌నం హాజ‌ర‌య్యే అవ‌కాశం
ఉంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate