బాహుబ‌లి రికార్డులు ప‌దిల‌మేనా?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన స‌రైనోడు క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం చూసిన వారెవ‌రికైనా వ‌చ్చే సందేహ‌మిదే..ఎందుకంటే తొలిరోజు స‌రైనోడుకి డివైడ్ టాక్ వ‌చ్చింది. స‌మీక్ష‌కులు య‌ధాప్ర‌కారం నెగిటివ్ రేటింగ్ లు ఇచ్చారు. కానీ సినిమా ఇప్ప‌టికే 64కోట్లు షేర్ దాటిపోయింది.మ‌రో 10కోట్లు వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్యంలేదు.అలా చేస్తే ఇండియా వసూళ్లు70కోట్లు ఉంటాయి..ఓవ‌ర్సీస్ కాకుండా 70కోట్లు పైన షేర్ వ‌సూలు చేసిన చిత్రాలు ఇప్ప‌టి వ‌ర‌కూ రెండే ..ఒక‌టి మ‌గ‌ధీర‌
రెండు బాహుబ‌లి..ఉత్త‌రాంధ్ర వ‌సూళ్లు ఇప్ప‌టికే టాప్ 2 పొజిష‌న్ కి చేరుకున్నాయి..ఇక్క‌డ బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‌ను అధిగ‌మించినా ఆశ్చ‌ర్యంలేదు..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ మొద‌టిరోజు వ‌సూళ్ళు కొన్ని చోట్ల బాహుబ‌లిని అధిగ‌మించిన విష‌యంతెలిసిందే..అంటే ఇవ‌న్నీ కూడా మారిన క‌లెక్ష‌న్ల ట్రెండ్ ని తెలియ‌చేస్తున్నాయి..ఈ ప‌రిస్ధితుల్లో తిర‌గులేని ఇమేజ్ ఉన్న‌హీరోలుగా గుర్తింపు పొందిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్,సూప‌ర్ స్టార్ మ‌హేష్ లాంటి వాళ్ళ చిత్రాలు తొలిరోజే సూప‌ర్ హిట్టాక్ స్వంతం చేసుకుంటే బాహుబ‌లి రికార్డుల‌కు మూడిన‌ట్లే..అది బ్ర‌హ్మోత్స‌వంతోనైనా కావ‌చ్చు లేదా ధ్రువ‌తో నైనాకావ‌చ్చు..

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate