మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు జ‌న్మ‌దిన‌శుభాకాంక్ష‌లు

మెగాబ్ర‌ద‌ర్స్ లో మ‌ధ్య‌ముడు మెగాభిమానుల‌కు ఇష్టుడు కొణిద‌ల‌నాగేంద్ర‌బాబు జ‌న్మ‌దినం(అక్టోబ‌ర్29).1986లో విడుద‌లైన రాక్ష‌సుడుచిత్రం ద్వారా న‌టుడిగా ప్ర‌వేశించిన మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు 420పేరుతో ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిట్ చిత్రంతోపాటు ధ‌ర్మ‌,దాద‌ర్ఎక్స్ ప్రెస్, హ్యాండ్స‌ప్‌,కౌర‌వుడు, ఆప‌ద‌మొక్కుల‌వాడు,ఏక్ పోలీస్‌, అంజ‌నీపుత్రుడు వంటి ప‌లుచిత్రాల‌లో హీరోగా న‌టించారు.అంజ‌నాప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నాగ‌బాబు నిర్మించిన రుద్ర‌వీణ చిత్రానికి ఉత్త‌మ‌జాతీయ‌స‌మైఖ్య‌తా చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు
ల‌భించింది.ఈటివిలో ప్ర‌సార‌మ‌వుతున్న జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా నాగ‌బాబు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నారు.మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ ఫిదాచిత్రం ద్వారా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు భ‌విష్య‌త్ లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటూ మూవీపాలిటిక్స్ డాట్ కామ్ ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate