మ‌హేష్…ఇలా అయితే క‌ష్ట‌మే

మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్అనునేను దాదాపుగా రెండువారాల ర‌న్‌ను పూర్తిచేసుకుంటోంది.90శాతం ర‌న్ పూర్తి అయిన‌ట్లుగానేభావించాలి.క‌లెక్ష‌న్స్ అయితే 80కోట్ల‌కు కాస్త అటూఇటూగా ఉన్నాయి.పైగా ఈక‌లెక్ష‌న్స్ పైకూడా పెద్ద వివాద‌మే న‌డిచింది.నిర్మాత వేసిన 161కోట్ల‌ఫిగ‌ర్ అయితే జోక్‌గా మిగిలిపోయింది అనుకోండి.నిర్మాత ఈ ఫిగ‌ర్ వెల్ల‌డించిన వెంట‌నే స్పైడ‌ర్ మొద‌టివారం 150కోట్లు అని ఆసినిమా
నిర్మాత ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ను భ‌ర‌త్ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌క్క‌ప్ర‌క్క‌న పెట్టి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు.ఇక క‌లెక్ష‌న్స్ ట్రాకింగ్ వెబ‌సైట్లు పెట్టిన క‌లెక్ష‌న్స్ లో కూడా కాస్త భారీగానే ఫేక్ ఫిగ‌ర్స్ ముఖ్యంగా క్రిష్ణా,గుంటూరు జిల్లాల డిస్ట్రిబ్యూట‌రే భారీ ఫేక్ ఫిగ‌ర్స్ ఇచ్చార‌ని విమ‌ర్శ‌లువెల్లువెత్తాయి.మిగిలిన ఏరియాల్లో కూడా అంత కాక‌పోయినా ఒరిజిన‌ల్‌గా వ‌చ్చిన‌దానికంటేక‌లెక్ష‌న్స్ పెంచి చూపించార‌నే విమ‌ర్శ‌లువ‌చ్చాయి.ఇంత‌చేసినా కూడా క్లోజింగ్ ఫిగ‌ర్ 85కోట్ల‌కు కాస్త అటూఇటూగానే ఉంటుంద‌ని తేలిపోయింది.4వ‌తేదీ నుండి నాపేరుసూర్య‌రిలీజ్ అవుతుంది. మ‌రో పెద్ద‌సినిమా మార్కెట్ లోకి దిగిన త‌రువాత భ‌ర‌త్ సాధించ‌గ‌లిగేది నామమాత్ర‌పు వ‌సూళ్ళే. అంటే వ‌రుస‌గా మూడుబ్లాక్‌బ‌స్ట‌ర్ లు ఇచ్చి మాక్జిమ‌మ్ గ్యారంటీ డైరెక్ట‌ర్‌గా పేరుప‌డ్డ కొర‌టాల‌శివ కాంభినేష‌న్‌లో శ్రీ‌మంతుడు త‌రువాత ప్రిన్స్ మ‌హేష్ న‌టించిన చిత్రంకావ‌టం,సినిమాల‌కు గోల్డెన్ సీజ‌న్ లాంటి స‌మ్మ‌ర్ సీజ‌న్ లో రిలీజ్ కావ‌టం,టిక్కెట్ రేట్లు చాలా చోట్ల 200రూపాయ‌ల‌కు పెంచి అమ్మ‌టం, పాజిటివ్‌టాక్ రావ‌టం ఇన్ని అంశాలు క‌ల‌సివ‌చ్చినా కూడా సినిమా 85కోట్ల మార్క్‌ద‌గ్గ‌రే ఆగిపోవ‌టం( ఇందులో ఒరిజిన‌ల్ క‌లెక్ష‌న్స్అయితే 75కోట్లు మించి ఉండ‌వు అనే ప్ర‌చారం ఒక‌టి ఉంది.) క‌నీసం బ్రేక్ ఈవెన్ (100కోట్ల‌కు సినిమా అమ్మారు)కాక‌పోవ‌టంఇవ‌న్నీ దేనికి సంకేతాలు.?..మ‌హేష్ స్టార్‌డ‌మ్‌ప‌డిపోయిందా?..వంద‌కోట్ల వ‌సూళ్ళు(షేర్‌) అంతఆషామ‌షీవిష‌యంకాదా?..హీరోస్టామినాభారీస్ధాయిలోఉంటేనేఅదిసాధ్య‌ప‌డుతుందా?..ఇలాంటి ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి..నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఇప్ప‌టి వ‌ర‌కూ 100కోట్ల షేర్ మార్క్‌ను ఖైదీ150,రంగ‌స్ధ‌లం చిత్రాలు మాత్ర‌మే అందుకున్నాయి. వీటిలో రంగ‌స్ధ‌లం అయితే 120కోట్లు పైగా షేర్ వ‌సూలు చేసింది. GST లో ఈ విధంగా వ‌సూలుచేసిన తొలిచిత్రం ఇదే..ఈరెండు చిత్రాల‌ను మిన‌హాయిస్తే ఒరిజిన‌ల్‌గా 85కోట్ల షేర్ ను అధిగ‌మించిన చిత్రాలు లేవంటే 100కోట్ల షేర్ అనేది టాలీవుడ్‌
కు అంత ఈజీ టాస్క్ కాద‌నే భావించాలి.భ‌ర‌త్అనునేను ఫైన‌ల్ రిజ‌ల్ట్ మ‌న‌కు మ‌రోసారి చెప్పే విష‌య‌మిదే..

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate