రేవంత్ అంటే బాబుకు భ‌య‌మా!

తెలంగాణ టి.డి.పి. నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఇర‌కాటంలోకి నెట్టింది.రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ‌తార‌న్న‌ప్ర‌చారం నేప‌ధ్యంలో అందుకు అనుగుణంగానే రేవంత్ దేశం నాయ‌కుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.అయితే ఆ వెంట‌నే.రేవంత్ వ్య‌వ‌హారంపై చ‌ర్చించ‌డానికి ఏర్పాటైన స‌మావేశానికి ఆయ‌న కూడాహాజ‌రు కావ‌టం పార్టీనేత‌ల‌కు మింగుడు ప‌డ‌లేదు. య‌న‌మ‌ల‌రామ‌క్రిష్ణుడు వంటి నేత‌ల‌పైతీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన తరువాత కూడా ఆయ‌న స‌మావేశానికి హాజ‌రుఅవుతార‌ని వారెవ‌రూ ఊహించ‌లేదు.రేవంత్ ఇంత అగ్రెసివ్ గా వెళుతున్నా బాబు ఆయ‌న‌పైచ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడుతున్నారంటే రేవంత్ అంటే బాబుకు భ‌య‌మా..ఓటుకునోటుకేసులో రేవంత్ నిజాలు చెప్పేస్తారేమోన‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారా..అని కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate