శివ‌సేన‌పై ఫ‌డ్న‌వీస్ ఆగ్ర‌హం

సెక్యులరిజం పేరుతో బీజేపీను దేశంలోని రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా బ్యాన్ అన్న రీతిలో వ్యవహరించిన వేళ.. ఆ పార్టీకి అండగా నిలిచిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన మాత్రమే. ఏ పరిస్థితుల్లో అయినా.. ఎన్ని విమర్శల్ని బీజేపీ ఎదుర్కొన్నా అండగా ఉన్నానంటూ వెన్నంటి నిలిచిన పార్టీగా శివసేనను చెప్పక తప్పదు. ఈ రోజు మోడీని చూపించి చంద్రబాబు మొదలుకొని పలు ప్రాంతీయ పార్టీ అధినేతలు మొదలుకొని కొన్ని జాతీయ పార్టీ అధినేతలు సైతం బీజేపీ వెన్నంటి ఉన్నారు.

ఈ రోజు దేశంలోనే తమకు తిరుగులేదని.. ప్రత్యామ్నాయం అసలే లేదంటూ జబ్జలు చరుచుకుంటున్న బీజేపీకి ఒకప్పుడు ఆ పార్టీతో దోస్తీ చేసేందుకు సైతం వణికిపోయేవారు. ఎవరిదాకానో ఎందుకు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బీజేపీతో తెగ తెంపులు చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని ఫీలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్న చంద్రబాబు.. అప్పట్లో ఇదే మోడీ తీరును తప్పు పట్టి మరీ దోస్తానాకు కటీఫ్ చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఇటీవల శివసేన నేత రౌత్ మాట్లాడుతూ మోడీ పాలన ఏ మాత్రం బాగోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. శివసేన రెండు నాల్కల ధోరణికి పాల్పడుతుందన్నారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తోందని.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలనుకుంటే వారు ఇవ్వొచ్చని కానీ ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించటం సరికాదని ఫడ్నవిస్ తేల్చి చెప్పటం గమనార్హం.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate