స్పైడర్ నిర్మాతకు చరణ్ సాయం?

స్పైడర్ సినిమా అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడంతో, నిర్మాతలు, ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కాస్త దెబ్బతిన్నారు. ఫైనాన్షియల్ గా ఎలా అన్న సంగతి ఎలా వున్నా, నిర్మాతలుగా మళ్లీ ట్రాక్ ఎక్కాల్సి వుంది. ఈ క్రమంలో ఎన్వీ ప్రసాద్ కు హీరో రామ్ చరణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలో ఓ సినిమా చేస్తానని ప్రసాద్ కు చరణ్ హామీ ఇచ్చినట్లు వినికిడి. ఈ మేరకు ఎన్వీ ప్రసాద్ ఇదే విషయం ఫార్వార్డ్ చేసి, తనపై వస్తున్న ప్రెజర్ ను కొంత తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రామ్ చరణ్ కు కెరీర్ టర్నింగ్ ఇచ్చిన ధృవ సినిమాను అరవింద్ తో కలిసి నిర్మించింది ఎన్వీ ప్రసాద్ నే.

అందువల్ల ఆయనను ఆదుకోవాలని చరణ్ ఈ హామీ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుతం చరణ్ చేస్తున్న రంగస్థలం పూర్తి కావచ్చింది. నిరంజన్ రెడ్డి-కొరటాల శివ కాంబినేషన్ సినిమా ప్లానింగ్ లో వుంది. మరి ఎన్వీ ప్రసాద్ ప్రాజెక్టుకు ఎవరు సెట్ అవుతారో చూడాలి.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate