హిట్ టాక్ వ‌చ్చి ఉంటే ఏంటి ప‌రిస్ధితి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం విడుద‌లై నెగిటివ్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌డ‌బ‌డుతున్న విష‌యంతెలిసిందే. అయితే ఈచిత్రం ప‌వ‌ర్ స్టార్ స్టామినా ఏంట‌నేది తెలియ‌చేసింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఈచిత్రంతొలిరోజు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 22కోట్లు షేర్ వ‌సూలుచేసింది.బాహుబ‌లి చిత్రం విడుద‌లైన‌పుడు ఆచిత్రం సాధించిన రికార్డుల‌ను అధిగ‌మించ‌టం మాట అటుంచి క‌నీసం స‌మీపంలోకి వెళ్ళ‌టం కూడా ఇప్ప‌ట్లో సాధ్యంకాద‌ని చాలామందిభావించ‌టంకాదు ఒక స్ధిర‌నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.బాహుబ‌లి 150కోట్ల‌బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రం..అంత‌ర్జాతీయ స్ధాయి గ్రాఫిక్స్‌నిపుణులు ఆచిత్రానికి ప‌నిచేసారు. ఆచిత్రం విడుద‌ల స‌మ‌యంలో మీడియా మొత్తం ఆచిత్రాన్ని త‌మ భుజాల‌పై మోసింది.ఆచిత్రంతో స‌మానంగా స‌ర్దార్ తొలిరోజు వ‌సూళ్ళు సాధించ‌టం అంద‌రినీ షాక్ కుగురిచేసింది.అప్ప‌టి వ‌ర‌ప‌కూ దుర్భేధ్యం అనివార‌నుకుంటున్న బాహుబ‌లి రికార్డులను ఒక ఫ్లాప్ టాక్ వ‌చ్చిన‌చిత్రం కొట్టినంత ప‌నిచేయ‌టం విస్మ‌య‌ప‌రిచింది.తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి,క్రిష్ణా,ఉత్త‌రాంధ్ర‌.జిల్లాల్లో అయితే బాహుబ‌లిని కొట్టేసింది..బాహుబ‌లి రికార్డుల‌ను కొట్టేయ‌టం ఇంత సులువా?అని అనిపించ‌టంతోపాటు అదీ ఒక ఫ్లాప్ చిత్రం కొట్టేయ‌టం అంటే..చాలామంది జీర్ణించుకోలేక‌పోయారు.ఒక‌వేళ స‌ర్దార్ కే హిట్ టాక్ వ‌చ్చి ఉంటే ఎక్క‌డా ఏరికార్డూ మిగిలిఉండేది కాద‌న‌టంలో సందేహంలేదు.

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate