Category Archives: Politics

ఎన్నాళ్ళ‌కి సోమువీర్రాజు!

బి.జె.పి. నాయ‌కుడుసోమువీర్రాజు ఈరోజు మీడియాముందుకు వ‌చ్చారు రెండు నెల‌ల క్రితం ఎ.పి. బి.జె.పి. అధ్య‌క్షుడిగా వీర్రాజును ప్ర‌క‌టించాల్పిఉండ‌గా చివ‌రి నిమిషంలో వెంక‌య్య‌నాయుడు అడ్డుప‌డ‌టంతో ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..అలిగారో,బాధ‌ప‌డ్డారో కానీ ఆనాటి నుంచి వీర్రాజు మీడియా కు క‌నిపించ‌లేదు.మ‌ళ్లీ ఇన్నాళ్ళ‌కు ప్యాకేజి విష‌యంపై స్పందిస్తూ మీడియా ముందుకు వ‌చ్చారు.అది కూడా ఇత‌ర బి.జె.పి.నాయ‌కుల్లా కాకుండా డిఫ‌రెంట్ గా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైఇత‌ర బి.జె.పి.నాయ‌కులు విరుచుకు ప‌డుతుంటే వీర్రాజు మాత్రం ప‌వ‌న్ కు మ‌ర్యాద ఇచ్చారు....
more

ఎన్నిక‌లు రావాల్సిందేనా?

తెలుగుదేశం ఒక‌ప‌క్క బి.జె.పి.ని విమ‌ర్శిస్తోంది.. మ‌రో వైపు బి.జె.పి.లో సోమువీర్రాజులాంటి నేత‌లు టి.డి.పి.ని ఆటాడుకుంటున్నారు.ఇంకో వైపు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరెండుపార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న‌ ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడు పార్టీలు ఒకేజ‌ట్టుగా ఉన్నాయి.ఇపుడు విమ‌ర్శించుకుంటున్నాయి క‌దా ఇక విడిపోయిన‌ట్లే అనుకోవ‌డానికి లేదు..ఎందుకంటే రాజ‌కీయం అంటే అదే..ఇలాంటి రాజ‌కీయంలో సాధార‌ణంగా కాంగ్రెస్ ఇటువంటి రాజ‌కీయంలో ఆరితేరిపోయి ఉంటుంది..ఇపుడు ఈమూడు పార్టీలు ఈ విష‌యంలో కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌ట్లున్నాయి.కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆపార్టీ లోనే గ్రూపులుగా...
more

ప‌వ‌న్ స‌భ పైనే అంద‌రి చూపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో రేపు జ‌రుప‌త‌ల‌పెట్టిన సీమాంధ్రా ఆత్మ‌గౌర‌వస‌భ పైనే ప్ర‌స్తుతం అంద‌రిచూపూ ఉంది. నిన్న‌టి రోజంతా కేంద్ర‌ప్ర‌భుత్వం ఊరించి ఊరించిఉస్సుర‌నిపించిన నేప‌ధ్యంలో ప్యాకేజిపై ప‌వ‌న్ స్పంద‌న‌ ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ స్వాగ‌తిస్తారా? లేక వ్య‌తిరేఖిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ స‌భ జ‌రిగే జె.ఎన్.టి.యు. మైదానం కేవ‌లం ల‌క్ష మందికి మాత్ర‌మే స‌రిపోతుంది.. కానీ ప‌వ‌న్ స‌భ‌కు కికేవ‌లం తూర్పుగోదావ‌రిజిల్లా నుంచే 4,5ల‌క్ష‌ల‌మంది జ‌నం హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది....
more

మ‌ళ్ళీ ముద్ ర‌గ‌డ‌!

కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం మ‌ళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌చ్చారు..తుని విధ్వంస‌ కాండ‌కు బాద్యుల‌ని ఆరోపిస్తూ సోమ‌వారం పోలీసులు తునిలో ఆరుగురిని అరెస్ట్ చేయ‌టంతోముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం రంగంలోకి దిగారు.అరెస్ట్ చేసిన‌వారితో పాటు మిగిలిన వారిపైకూడా జూన్ 8వ‌తేదీ సాయంత్రంలోపు కేసులు ఎత్తివేయాల‌ని లేనిప‌క్షంలో 9వ‌తేదీ ఉద‌యం9గంట‌ల నుంచితాను నిరాహార‌దీక్ష‌కు దిగుతాన‌నిముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం హెచ్చ‌రించారు.ముద్ర‌గ‌డ‌అన్నంత ప‌నీ చేస్తారుకాబ‌ట్టి మ‌రోసారి తెలుగుదేశం ప్ర‌భుత్వానికి తిప్ప‌లు త‌ప్పేలాలేవు....
more

గంటా మొన‌గాడేనా?..ముందుచూపు ఉన్న‌వాడూనా?

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో పార్టీ మార‌టం ఎంత స‌హ‌జ‌మో తాము ప్ర‌స్తుతం ఉన్న పార్టీఅధినేత‌కు విధేయ‌త‌తో ఉండ‌టం కూడా అంతే స‌హ‌జం..అధినేత మ‌న‌సెరిగి న‌డ‌చుకున్న‌వారే పార్టీలో అయినా ప్ర‌భుత్వంలో అయినా అంద‌లాలెక్కుతారు.అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖా మంత్రి గంటాశ్రీనివాస‌రావు వ్య‌వ‌హార‌శైలి ఇందుకు భిన్నంగా ఉంది..మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్ధాపించిన‌పుడు గంటా తెలుగుదేశంపార్టీకి రాజినామా చేసి చిరంజీవి వెంట న‌డిచారు..ఏ ముహూర్తాన గంటా చిరంజీవితో చేతులు క‌లిపారో కానీ ఆయ‌న చిరంజీవికి అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు.చిరంజీవి కూడా గంటాకు అంత ప్రాధాన్య‌త‌ ఇచ్చారు.కాంగ్రెస్ లో విలీనం...
more

వై.సి.పి.నుంచి మ‌రో వికెట్

వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాన‌ని అన్నారో కానీ ఆనాటి నుంచి వై.సి.పి. నుంచి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతూనే ఉంది.ఇప్ప‌టికి 11మంది శాస‌న‌స‌భ్యులు,ఒక ఎం.ఎల్.సి వై.సి.పి.నుంచి టి.డి.పి.లో చేరిపోగా తాజాగా బొబ్బిలి ఎం.ఎల్.ఎ. సుజ‌య‌క్రిష్ణ‌రంగారావు కూడా జంప్ జిలానీల జాబితాలో చేరిపోనున్నారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ఆయ‌న టి.డి.పి.లో చేరిపోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు....
more

భూమా వ‌ల‌స ప్రారంభ‌మా!

తెలంగాణ‌లో దాదాపుగా దుకాణం స‌ర్దేయ‌టంతో దిమ్మెర‌పోయిన తెలుగుదేశంపార్టీ ఈన‌ష్టాన్ని ఆంధ్ర‌లో పూడ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌టం వై.సి.పి.కి ప్రాణ‌సంక‌టంగా మారిన‌ట్లుంది.ఎప్ప‌టినుంచో క‌ర్నూలుజిల్లాకుచెందిన ఎం.ఎల్.ఎ.లు టి.డి.పి.లో చేర‌తార‌న్న ఊహాగానాలు ఇపుడు నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి.నంధ్యాలఎం.ఎల్.ఎ భూమానాగిరెడ్డి ఆయ‌న‌కుమార్తె ఆళ్ళ‌గ‌డ్డఎం.ఎల్.ఎఅఖిల‌ప్రియటి.డి.పి. లోచేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే మాత్రం వై.సి.పికిచావుదెబ్బే..సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌బ‌ల‌మైన నేత స‌పైగా బంధువు అయిన భూమానేవై.సి.పి పైవిశ్వాశం కోల్పోతే ఇక మిగిలిన నేత‌లువై.సి.పినుంచి టి.డి.పి.కిక్యూ క‌ట్ట‌డం ప్రారంభ‌మ‌వుతుంద‌న‌టంలో సందేహంలేదు....
more

బాబూ క్రిష్ణ‌య్య మాట‌లు వింటున్నారా?

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్స్ ఇచ్చి తీర‌తామ‌ని ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతుంటే ఆయ‌న పార్టీకిచెందిన ఎం.ఎల్.ఎ. ఆర్. క్రిష్ణ‌య్యమాత్రం ఖ‌బ‌డ్దార్ కాపుల‌ను బి.సి.ల్లో చేరిస్తే ఊరుకోం అంటున్నారు. కాపుల‌ను బి.సి.ల్లో చేర్చే విష‌యంలో తాము చిత్త‌శుద్దితో ఉంటే ప్ర‌తిప‌క్షాలే రాజ‌కీయం చేస్తున్నాయ‌ని అంటున్న బాబు మ‌రి క్రిష్ణ‌య్యమాట‌ల‌కేం స‌మాధానం చెబుతారో చూడాలి.తెలుగుదేశం పార్టీ త‌న ఎన్నిక‌ల‌మ్యాని ఫెస్టోలో కాపుల‌ను బి.సి.ల్లో చేరుస్తామ‌ని హ‌మీ ఇచ్చిన‌పుడు ఆపార్టీలోనే ఉన్న క్రిష్ణ‌య్య అపుడు అభ్యంత‌రంచెప్ప‌కుండా ఇపుడు మాట్లాడ‌టంలో రాజ‌కీయ‌మేమిటో బాబే చెప్పాలి....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate
ad1
ad2