Category Archives: Politics

గ‌జ‌దొంగ భీంసింగ్ ఎన్ కౌంట‌ర్‌

కర్నూలు పోలీసులు సంచలనం సృష్టించారు. దారి దోపిడీకి పాల్పడిన గజదొంగను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లిన వారు.. గజదొంగను ఎన్ కౌంటర్ చేసేశారు. దాదాపు 144 దొంగతనాలతో సంబంధం ఉన్న అతగాడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సాధ్యం కాకపోవటంతో.. ఎన్ కౌంటర్ చేసి పారేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఓ స్కార్పియోలో ఒక కంపెనీకి చెందిన రూ.5.5కోట్లను సేఫ్ లాకర్లో ఉంచి తరలిస్తున్నారు. అయితే.. కొందరు దుండగులు...
more

విద్యాసంస్ధ‌ల వీధి పోరాటం

కార్పొరేట్ కోట్లాట వీధుల్లోకి వచ్చింది. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నారాయణ.. చైతన్య సంస్థల మధ్య పోటీ పరాకాష్ఠకు వెళ్లటం.. ఒక స్కూల్కు చెందిన విద్యార్థుల్ని వేరే వాళ్లు తీసుకెళ్లటం.. ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్లటం లాంటివి తెలిసిందే. నెల్లూరుకు చెందిన నారాయణ స్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులను శ్రీచైతన్య స్కూల్ వాళ్లు తీసుకెళ్లారంటూ ఆరోపణలు రావటం.. ఈ వ్యవహారంపై కిడ్నాప్ చేశారంటూ కేసులు నమోదు చేయటం తెలిసిందే. దీంతో.. ఇంతకాలం మీడియాకు ఎక్కని వీరి...
more

అఫిషియల్ః టీడీపీకి రేవంత్ గుడ్ బై

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక పదవి నుంచి - ఫ్లోర్ లీడర్ పోస్ట్ నుంచి రేవంత్ ను తొలగించిన నేపథ్యంలో... విజయవాడలో చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వం - పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేసిన అనంతరం పార్టీకి రాజీనామా చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు....
more

శివ‌సేన‌పై ఫ‌డ్న‌వీస్ ఆగ్ర‌హం

సెక్యులరిజం పేరుతో బీజేపీను దేశంలోని రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా బ్యాన్ అన్న రీతిలో వ్యవహరించిన వేళ.. ఆ పార్టీకి అండగా నిలిచిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన మాత్రమే. ఏ పరిస్థితుల్లో అయినా.. ఎన్ని విమర్శల్ని బీజేపీ ఎదుర్కొన్నా అండగా ఉన్నానంటూ వెన్నంటి నిలిచిన పార్టీగా శివసేనను చెప్పక తప్పదు. ఈ రోజు మోడీని చూపించి చంద్రబాబు మొదలుకొని పలు ప్రాంతీయ పార్టీ అధినేతలు మొదలుకొని కొన్ని జాతీయ పార్టీ అధినేతలు...
more

రేవంత్ అంటే బాబుకు భ‌య‌మా!

తెలంగాణ టి.డి.పి. నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఇర‌కాటంలోకి నెట్టింది.రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ‌తార‌న్న‌ప్ర‌చారం నేప‌ధ్యంలో అందుకు అనుగుణంగానే రేవంత్ దేశం నాయ‌కుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.అయితే ఆ వెంట‌నే.రేవంత్ వ్య‌వ‌హారంపై చ‌ర్చించ‌డానికి ఏర్పాటైన స‌మావేశానికి ఆయ‌న కూడాహాజ‌రు కావ‌టం పార్టీనేత‌ల‌కు మింగుడు ప‌డ‌లేదు. య‌న‌మ‌ల‌రామ‌క్రిష్ణుడు వంటి నేత‌ల‌పైతీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన తరువాత కూడా...
more

ఇదేమి స‌మ‌ర్దింపు ఎన్నిక‌ల క‌మీష‌న్‌…

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌,గుజ‌రాత్ ఎన్నిక‌లు 2012లో ఒకేసారి జ‌రిగాయి. అలాగే వాటి ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా అప్పుడు ఒకేసారి విడుద‌లైంది. కానీ ఇపుడు మాత్రం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ 10 రోజుల...
more

ఎన్నాళ్ళ‌కి సోమువీర్రాజు!

బి.జె.పి. నాయ‌కుడుసోమువీర్రాజు ఈరోజు మీడియాముందుకు వ‌చ్చారు రెండు నెల‌ల క్రితం ఎ.పి. బి.జె.పి. అధ్య‌క్షుడిగా వీర్రాజును ప్ర‌క‌టించాల్పిఉండ‌గా చివ‌రి నిమిషంలో వెంక‌య్య‌నాయుడు అడ్డుప‌డ‌టంతో ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే..అలిగారో,బాధ‌ప‌డ్డారో కానీ ఆనాటి నుంచి వీర్రాజు మీడియా కు క‌నిపించ‌లేదు.మ‌ళ్లీ ఇన్నాళ్ళ‌కు ప్యాకేజి విష‌యంపై స్పందిస్తూ మీడియా ముందుకు వ‌చ్చారు.అది కూడా ఇత‌ర బి.జె.పి.నాయ‌కుల్లా కాకుండా డిఫ‌రెంట్ గా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైఇత‌ర బి.జె.పి.నాయ‌కులు విరుచుకు ప‌డుతుంటే వీర్రాజు మాత్రం ప‌వ‌న్ కు మ‌ర్యాద ఇచ్చారు....
more

ఎన్నిక‌లు రావాల్సిందేనా?

తెలుగుదేశం ఒక‌ప‌క్క బి.జె.పి.ని విమ‌ర్శిస్తోంది.. మ‌రో వైపు బి.జె.పి.లో సోమువీర్రాజులాంటి నేత‌లు టి.డి.పి.ని ఆటాడుకుంటున్నారు.ఇంకో వైపు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరెండుపార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న‌ ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడు పార్టీలు ఒకేజ‌ట్టుగా ఉన్నాయి.ఇపుడు విమ‌ర్శించుకుంటున్నాయి క‌దా ఇక విడిపోయిన‌ట్లే అనుకోవ‌డానికి లేదు..ఎందుకంటే రాజ‌కీయం అంటే అదే..ఇలాంటి రాజ‌కీయంలో సాధార‌ణంగా కాంగ్రెస్ ఇటువంటి రాజ‌కీయంలో ఆరితేరిపోయి ఉంటుంది..ఇపుడు ఈమూడు పార్టీలు ఈ విష‌యంలో కాంగ్రెస్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న‌ట్లున్నాయి.కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆపార్టీ లోనే గ్రూపులుగా...
more

ప‌వ‌న్ స‌భ పైనే అంద‌రి చూపు

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో రేపు జ‌రుప‌త‌ల‌పెట్టిన సీమాంధ్రా ఆత్మ‌గౌర‌వస‌భ పైనే ప్ర‌స్తుతం అంద‌రిచూపూ ఉంది. నిన్న‌టి రోజంతా కేంద్ర‌ప్ర‌భుత్వం ఊరించి ఊరించిఉస్సుర‌నిపించిన నేప‌ధ్యంలో ప్యాకేజిపై ప‌వ‌న్ స్పంద‌న‌ ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ స్వాగ‌తిస్తారా? లేక వ్య‌తిరేఖిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇదిలాఉండ‌గా ప‌వ‌న్ స‌భ జ‌రిగే జె.ఎన్.టి.యు. మైదానం కేవ‌లం ల‌క్ష మందికి మాత్ర‌మే స‌రిపోతుంది.. కానీ ప‌వ‌న్ స‌భ‌కు కికేవ‌లం తూర్పుగోదావ‌రిజిల్లా నుంచే 4,5ల‌క్ష‌ల‌మంది జ‌నం హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది....
more

మ‌ళ్ళీ ముద్ ర‌గ‌డ‌!

కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం మ‌ళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌చ్చారు..తుని విధ్వంస‌ కాండ‌కు బాద్యుల‌ని ఆరోపిస్తూ సోమ‌వారం పోలీసులు తునిలో ఆరుగురిని అరెస్ట్ చేయ‌టంతోముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం రంగంలోకి దిగారు.అరెస్ట్ చేసిన‌వారితో పాటు మిగిలిన వారిపైకూడా జూన్ 8వ‌తేదీ సాయంత్రంలోపు కేసులు ఎత్తివేయాల‌ని లేనిప‌క్షంలో 9వ‌తేదీ ఉద‌యం9గంట‌ల నుంచితాను నిరాహార‌దీక్ష‌కు దిగుతాన‌నిముద్ర‌గ‌డ‌ప‌ద్మ‌నాభం హెచ్చ‌రించారు.ముద్ర‌గ‌డ‌అన్నంత ప‌నీ చేస్తారుకాబ‌ట్టి మ‌రోసారి తెలుగుదేశం ప్ర‌భుత్వానికి తిప్ప‌లు త‌ప్పేలాలేవు....
more

mega-power-ban2
mega-power-ban2
Shortcodes Ultimate